top of page
Search

ప్రియమైన భర్తకు రాయునది, నా మనసు బాధను వింటావా?

Aug 19
2 min read

Updated: Aug 21

కోపంతో తన కుటుంబాన్ని గాయపరుస్తున్న భర్తకు ఒక లేఖ




డియర్ హస్బెండ్,


నేను చెప్పే విషయాల్ని శ్రద్ధగా అలోచించు, వెంటనే నన్ను తప్పుపట్టాలనే ఉద్ధేశంతో ఈ letter చదవొద్దు.


I love you! కానీ నేరుగా విషయం చెబుతాను, దయచేసి కొంచెం వింటావా? Please.


మనిద్దరం ఒకరినొకరం తప్పు పట్టుకుంటూ ఉంటే, దానికి అంతం ఉండదు. అందుకే తప్పులు ఎత్తిచూపుకోవడం సమస్యకు పరిష్కారం కాదు. . ఎందుకంటే దేవుని వాక్యం, "వివాహము అన్నిటిలో ఘనమైనది" అని చెబుతోంది గనుక నేను మనం మళ్లీ కలవాలని కోరుకుంటున్నాను.


దేవుని సాక్షిగా, విశ్వాసుల మధ్య, ఎంతోమంది ఎదుట మనం ఒకరికొకరం నమ్మకంగా ఉంటామని మాటిచ్చామని నీకు గుర్తుందా? అది చిన్న విషయం కాదు. అది నన్ను ఉక్కిబిక్కిరి చేస్తుంది. మనం చేసే ప్రతి పనిలో దేవుణ్ణి ఘనపరచాలని అనే అలోచన నాకు నిద్రపట్టనివ్వట్లేదు. నేను నా వివాహాన్ని దేవుని కొరకు కాపాడుకోవాలనుకుంటున్నాను. ఇతరులు ఏమనుకుంటారో నాకు అంత ముఖ్యంకాదు. ఒక రోజు నేను దేవుని తీర్పు సింహాసనం ముందు నిలబడాలి. అప్పుడు నేరుగా ఆయనకే లెక్క చెప్పాలి. ఈ విషయం తలుచుకొంటే నాకు భయమేస్తుంది!


నేను perfect కాదు. కానీ యేసు నా రక్షకుడు కాబట్టి ఆయనకు లోబడాలని కోరుకుంటున్నాను.

నాలో చాలా తప్పులున్నాయని నువ్వంటే నేను ఒప్పుకొంటాను. నా వల్ల నువ్వు బాధపడి ఉంటే, నేను నిన్ను సరిగా అర్థం చేసుకోకపోయి ఉంటే, నన్ను క్షమించు. నేను నీ మాట వినడానికి సిద్ధంగా ఉన్నాను. దేవునికి ఇష్టమైన భార్యగా మారడానికి నా జీవితాన్ని మార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను.


కానీ ఇప్పుడు నేను ఎదుర్కొంటున్న సమస్యను నీకు చెప్పాలనుకుంటున్నాను.

నీ కోపం ఎప్పుడు వస్తుందో నాకు తెలియదు. నువ్వు కోపపడితే నాకు చాలా భయం వేస్తుంది. భయపడుతున్నప్పుడు నువ్వు చెప్పేది అర్ధం చేసుకోవడమే కష్టమైతే, దానికి అంగీకరించడం ఇంకా కష్టం. నీ కోపం నన్ను ఎంతగా గాయపరుస్తుందో నేను మాటల్లో చెప్పలేను. నువ్వు చెప్పిన పని నేను ప్రేమతో చేయడం లేదు; భయంతో చేస్తున్నాను. ఎప్పుడూ ఏదో తప్పు జరుగుతుందేమో అన్న భయంతోనే జీవిస్తున్నాను.


ఒక్కసారి నా పరిస్థితిలో నువ్వు ఉన్నట్టు ఆలోచించు. ఎప్పుడూ కోపపడే వ్యక్తితో జీవించడం చాలా కష్టం. ఇతరుల్ని భయపెట్టి బలవంతంగా లోబరుచుకోమని క్రీస్తు మనకు నేర్పించలేదు.ఆయన తన సంఘం కోసం తన ప్రాణాన్నే ఇచ్చాడు. ప్రేమ పవిత్రత, కరుణ, జాలి, సహనం, సత్యంతో మాత్రమే ఇతరుల్ని గెలవగలం మని క్రీస్తు మనకు నేర్పాడు. అంతే కాని, భార్యను కాళ్లకింద వేసుకునే చాపలా చూడమని క్రీస్తు ఎప్పుడూ చెప్పలేదు. నిజమైన challenge నువ్వు ఎంత గట్టిగా అరవగలవో కాదు; నీ హృదయంలో ఉన్న కోపాన్ని ఎంతవరకు జయించగలవో అదే. క్రీస్తు భర్తలను అదే చేయమని పిలుస్తున్నాడు. కుటుంబానికి నాయకుడిగా, దేవుని ముందు వివాహాన్ని కాపాడే బాధ్యత భర్తపై మరింత ఎక్కువగా ఉందని నేను నమ్ముతున్నాను.


మనిద్దరి పెద్ద సమస్య ఏమిటంటే, మనం క్రీస్తుకు పూర్తిగా లోబడడం లేదు. మన హృదయం చెప్పింది, మన కుటుంబం చెప్పింది, లేదా ఈ లోకం చెప్పిందే చేస్తున్నాం.దాని వలన మనకు ఉపయోగం లేదు. మన కుటుంబాన్ని నిజంగా కట్టగలిగేది యేసు మాత్రమే.


ఇంకో విషయం. ఇప్పుడు మన జీవితాలకు ఆత్మీయంగా దారి చూపించే వారు మనకు లేరు. అందుకే మనం మళ్లీ మళ్లీ ఒకరినొకరం గాయపరుచుకొంటున్నాం. మనం దేవునిలో పరిణతి పొందిన విశ్వాసులకు మనం లోబడాలి. వారు మనల్ని ప్రేమతో సరిదిద్దుతూ, దేవుని వాక్యంతో నడిపిస్తారు. మన సమస్యలన్నింటికీ మనమే పరిష్కరించగలమని అనుకుంటే మనకు ఎవరి సహాయం అవసరం లేదు. కానీ మన హృదయం మోసం చేస్తుందని, మన తప్పులను మనమే సమర్థించుకుంటామని దేవుని వాక్యం చెబుతోంది. అలాంటప్పుడు దేవునికి లోబడాలికదా? దేవుడు మనకు ఒక ఆత్మీయమైన కుటుంబాన్ని (సంఘం) ఇచ్చాడని మనం మర్చిపొయాం. దేవుడు తన సంఘం ద్వారా కూడా మనతో మాట్లాడతాడని నువ్వు నువ్వు నమ్ముతున్నావా? మనిద్దరినీ యేసు దగ్గరకు నడిపించే ఆత్మీయుల సహాయం కోరుతున్నాను. ఎందుకంటే మన హృదయాలను మార్చగలిగేది యేసు మాత్రమే. నువ్వు కూడా నాతోపాటు రావా? ప్లీజ్.


నాలో కూడా నాకు కనిపించని తప్పులు ఉన్నాయి. వాటిని నేను సరిచేసుకోవాలి. అందుకు నాకు దేవుని సహాయం అవసరం. నేను దేవుని బోధకు లోబడడానికి సిద్ధంగా ఉన్నాను.

నేను తాత్కాలిక పరిష్కారం కాదు, శాశ్వత పరిష్కారం కోరుకుంటున్నాను. యేసు మన కుటుంబాన్ని బాగుచేస్తాడని నమ్మకం నాకుంది.


ప్రభువు ఇలా అంటున్నాడు.

"శ్రమపడి భారములు మోసుకొనుచున్న వారలారా, మీరందరు నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను. నేను సాత్వికుడను, దీనమనస్సుగలవాడను గనుక నా కాడి ఎత్తుకొని నన్ను నేర్చుకొనుడి. అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును." (మత్తయి 11:28–29)

My dear husband! మనం కలిసి యేసు దగ్గరకు వెళ్దాం. ఆయన దగ్గరే గాయపడిన హృదయాలకు విశ్రాంతి, మన కుటుంబానికి శాంతి, మన జీవితాలకు నిజమైన మార్పు దొరుకుతుంది.

దయచేసి వెంటనే సమాధానం చెప్పకుండా, ప్రార్థించి బాగా ఆలోచించి తర్వాత స్పందించు.


ప్రేమతో,

నీ ప్రియమైన భార్య.

నీ భార్య

 
 
 

Comments


మమ్మల్ని సంప్రదించండి

How can we help?

Tell us what you're struggling with
Abuse
Trauma
Marital Conflict
Premarital Counseling
Pornography
Suicidal Ideation
Depression
OCD

కాపీరైట్ © 2025 అలబాస్టర్ సోల్ కేర్ . సర్వ హక్కులు సంరక్షించబడినవి.

లయన్ కల్చర్ మీడియాచే రూపొందించబడింది

bottom of page